¡Sorpréndeme!

Travis Head vs Maxwell Stoinis Fight | ఐపీఎల్ మ్యాచులో ఆస్ట్రేలియన్ల మధ్య ఫైట్ | ABP Desam

2025-04-13 13 Dailymotion

మీరు ఎప్పుడైనా క్రికెట్ లో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ తోటి ఆస్ట్రేలియన్  ప్లేయర్స్ తోనే గొడవపడటం చూశారా. వాళ్లే అందరినీ రెచ్చగొడతారు వాళ్లు ఎవరితో గొడవపడతారు అనేగా. నిన్న ఈ అరుదైన ఘటన జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆడుతున్న ఆస్ట్రేలియన్ ఆటగాడు ట్రావియెస్ హెడ్ కి...పంజాబ్ కి ఆడుతున్న మరో ఇద్దరు ఆస్ట్రేలియన్ ఆటగాళ్లైన మ్యాక్స్ వెల్, స్టాయినిస్ కి గొడవ జరిగింది. అసలు ఏమైంది అంటే...పంజాబ్ నిర్దేశించిన 247 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో మొదటి వికెట్ కే 171 పార్టనర్ షిప్ పెట్టారు ట్రావియెస్ హెడ్, అభిషేశ్ శర్మ. ఇందులో భాగంగా తొమ్మిదో ఓవర్ లో 49 పరుగుల దగ్గర హెడ్ ఉన్నప్పుడు గొడవ మొదలైంది. మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో వరుసగా రెండు బంతులను సిక్సర్లుగా మార్చిన హెడ్...తర్వాత బంతిని మాత్రం మిస్ అయ్యాడు. అది వికెట్లను జస్ట్ తాకేదే కానీ పక్క నుంచి వెళ్లిపోయింది. దీనిపై అసహనానికి గురయ్యాడు హెడ్. ఈ లోగా మ్యాక్సీ బాల్ ను అందుకుని హెడ్ ను సీరియస్ గా చూస్తుండటంతో హెడ్ కి కోపం వచ్చింది. ఎందుకు చూస్తున్నావ్ బాల్ ని విసిరేసిందే కాకుండా అని అరిచాడు. దీంతో నవ్వుతూనే మ్యాక్సీ హెడ్ కి ఏదో సమాధానం చెప్పాడు. ఈలోగా మ్యాక్స్ వెల్ కి సపోర్ట్ గా వచ్చిన స్టాయినిస్ హెడ్ తో వాగ్వాదానికి దిగటం కనిపించింది. అంపైర్ వచ్చి కలుగ చేసుకుని ముగ్గురిని కంట్రోల్ చేశాడు. అయితే దీని మీదే మ్యాచ్ తర్వాత మాట్లాడిన హెడ్...మాలోని కంప్లీట్ ఆటను బయటకు తీసే క్రమంలో ఇలాంటివి వస్తూ ఉంటాయి సహజం. పైగా మేం ముగ్గురుం ఒకరికి ఒకరు కావాల్సిన వాళ్లం...అందుకే వాదన ఇంక పెద్దది కాకూడదని వదిలేశా. దాన్ని అంత సిరీయస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు హెడ్. మొత్తం సన్ రైజర్స్ కోసం  తోటి ఆస్ట్రేలియా ఆటగాళ్లతోనే గొడవకు దిగి హెడ్ తన లోయల్టీని మరింతగా పెంచుకుంటే..ఇలా క్రికెట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా క్రికెటర్లే గొడవ పడుతుండటం తో ఈ వీడీయోలు వైరల్గా మారాయి.